రామాయణం గొప్ప విజన్ తో తెరకెక్కిన సినిమా: రాకింగ్ స్టార్ యశ్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

రామాయణం సినిమా గొప్ప విజన్తో తెరకెక్కిందని, ఇది అందరికీ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని రాకింగ్ స్టార్ యశ్ పేర్కొన్నారు. రణ్బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో యశ్ మాట్లాడుతూ, నమిత్ మల్హోత్రా కలగన్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్లో రావణుడి పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఎస్వీసీ ద్వారా విడుదల చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.