సంగారెడ్డి ఆలయంలో పాము కలకలం భక్తులు పరుగులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి పట్టణ శివారులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి పాము ప్రవేశించడంతో కొద్దిసేపు కలకలం నెలకొంది. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో భక్తులు, సిబ్బంది అప్రమత్తమయ్యారని స్థానికులు తెలిపారు. వెంటనే పాములు పట్టే సద్దాంకు సమాచారం అందించగా, ఆయన హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించిన జర్రిపోతు పామును సద్దాం చాకచక్యంగా పట్టుకొని సురక్షితంగా తన వెంట తీసుకెళ్లడంతో ఆలయ సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.