వంటగది చిట్కాలు: బొంబాయి రవ్వ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
బొంబాయి రవ్వలో పురుగులు చేరకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవడానికి ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ బదోరియా పలు సులభమైన చిట్కాలను వెల్లడించారు. రవ్వను డ్రై రోస్ట్ చేయడం లేదా ఫ్రిజ్ లో భద్రపర్చడం ద్వారా తేమ సమస్యను నివారించవచ్చని తెలిపారు. అలాగే వెల్లుల్లి రెబ్బలు లేదా లవంగాలు డబ్బాలో వేయడం వల్ల పురుగులు దరిచేరకుండా రక్షించుకోవచ్చని ఆమె వివరించారు.