వరంగల్ ఎంజీఎం వద్ద మాజీ విప్ దాస్యంపై పోలీసుల దాడి
రిపోర్టర్: విజయ్
స్థలం: Warangal
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి దుస్థితిని ప్రశ్నిస్తూ పరిశీలనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడం, పెచ్చులూడుతున్న పైకప్పులు, ఆంబులెన్స్ ల కొరత వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెళ్లిన ఆయనపై పోలీసులు పాశవికంగా వ్యవహరించడం తీవ్ర కలకలం రేపింది.