కరెంట్ కోతలపై దుబ్బాక రైతుల ఆగ్రహం: సబ్స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దుబ్బాక

దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి సబ్స్టేషన్ ఎదుట రైతులు తీవ్ర నిరసన తెలిపారు. వ్యవసాయానికి అరకొర కరెంట్ ఇస్తున్నారని, అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోయారు. పన్నెండు గంటల విద్యుత్ ఇప్పుడు ఆరు గంటలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు.