భక్తిశ్రద్ధలతో శంకర్పల్లిలో డీసీఎం లారీ అసోసియేషన్ అన్నప్రసాద వితరణ
రిపోర్టర్: SARA ASHOK
స్థలం: శంకర్పల్లి
శంకర్పల్లి పట్టణ కేంద్రంలో ఆదివారం డీసీఎం లారీ అసోసియేషన్ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పట్టణ పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మహా ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రులయ్యారని నిర్వాహకులు తెలిపారు.