సంక్షేమ పథకాల అర్హత కోసం ఐఐటీ కాన్పూర్ ఫ్యామిలీ స్కోర్!
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలను సులభంగా గుర్తించేందుకు ఐఐటీ కాన్పూర్ 'ఫ్యామిలీ స్కోర్' పేరిట సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ డేటాను ఉపయోగించి ఇంటింటి సర్వేల అవసరం లేకుండానే కుటుంబాల సామాజిక-ఆర్థిక స్థితిని ఇది అంచనా వేస్తుంది. ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఈ ఒప్పందపు ప్రాథమిక ఫలితాలను సీఎం చంద్రబాబుకు ఐఐటీ నిపుణులు వివరించగా, ఆయన ఈ వ్యవస్థను ప్రశంసించారు.