ఆమదాలవలసను ముంచెత్తిన తుఫాన్ వర్షాలతో నరకయాతన పడుతున్న పాఠశాల విద్యార్థులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆమదాలవలస

ఆమదాలవలసలో ఆర్నాబ్ తుఫాన్ వలన కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రవేశ గేట్ల వద్ద వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు వార్డుల్లో మురుగు కాలువల నీరు రోడ్లపై పారుతుండటంతో అధికారులు తగు చర్యలు తీసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.