ఢిల్లీ వేదికగా విశ్వకర్మ జయంతికి వెళ్లనున్న ఉత్తరాంధ్ర ప్రతినిధులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విశాఖపట్నం రూరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి ఆహ్వానం మేరకు ఈనెల 17న న్యూఢిల్లీలోని ప్రగతి భారత్ భవన్ లో నిర్వహించనున్న విశ్వకర్మ భగవాన్ జయంతి నేషనల్ కార్పెంటర్ ఎగ్జిబిషన్ టూల్స్ అండ్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర నుంచి కార్పెంటర్ ప్రతినిధులు బయలుదేరారు. ఈ ప్రతినిధుల బృందంలో బేతాళ సన్యాసిరావు, అరటి కట్ల హరిబాబు, ముల్లేటి సత్యనారాయణ, వనమోజు శివాజీ, అండ్లూరు గణేష్, చిట్టూరి కృష్ణ, టేకి కృష్ణ హాజరుకానున్నారు.