ఆటోలో సాహసయాత్ర: భారత్లో ట్రిప్ వేస్తున్న నార్వే దేశపు మేయర్

రిపోర్టర్: నరేష్ స్థలం: Limbdi

భారతదేశంలో ఆటో రిక్షాపై సాహసయాత్ర చేపట్టి నార్వే దేశానికి చెందిన పోర్సంగర్ మున్సిపాలిటీ మేయర్ జో ఇంగే హెస్జెవిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. రాజస్థాన్లోని జైసల్మేర్ నుండి కేరళలోని ఫోర్ట్ కొచ్చి వరకు సుమారు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతోందని ఆయన తన సహచరుడితో కలిసి ప్రయాణిస్తున్నట్లు స్థానికులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నిరాడంబర ప్రయాణం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.