పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
భారతదేశంలో పాస్పోర్ట్ నిబంధనల్లో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేపట్టింది. కొత్తగా అమల్లోకి వచ్చిన పాస్పోర్ట్ సవరణ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల లోపు పిల్లలకు జారీ చేసే సాధారణ పాస్పోర్ట్ ఐదేళ్లు లేదా ఆ బాలుడు లేదా బాలికకు 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. వయసు వర్గాల వారీగా పాస్పోర్ట్ చెల్లుబాటు కాలం మరియు ఫీజుల్లో మార్పులు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.