అవయవదానంతో నలుగురి ప్రాణాలు నిలిపి అమరుడైన రైతు నర్సిరెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆత్మకూరు

వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్పై నుంచి జారిపడి బ్రెయిన్ డెడ్ అయిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం సింగారం రైతు పన్నాల నర్సిరెడ్డి కుటుంబం మహోన్నత నిర్ణయం తీసుకుంది. భార్య భాగ్యలక్ష్మి ఔదార్యంతో రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దానం చేసి నలుగురికి పునర్జన్మ ప్రసాదించారు. మరణాంతరం కూడా జీవదాతగా నిలిచిన నర్సిరెడ్డి కుటుంబ సభ్యుల ఉదారత్వాన్ని స్థానికులు కొనియాడుతున్నారు.