కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా కుమార్తె కిమ్-జు-యే ఖరారు
రిపోర్టర్: శివ
స్థలం: World
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రాజకీయ వారసురాలిగా ఆయన 13 ఏళ్ల కుమార్తె కిమ్-జు-యే ఖరారైనట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ స్పష్టం చేసింది. కిమ్‌కు కొడుకు ఉన్నప్పటికీ వారసుడు అయ్యే స్థితిలో లేడని పేర్కొంది. ఇటీవలి కాలంలో ఆమె సైనిక విన్యాసాలు, అధికారిక కార్యక్రమాల్లో తండ్రితో కలిసి పాల్గొంటూ ప్రాధాన్యత సంతరించుకుంటున్నట్లు వెల్లడించింది.