సీతారామపురంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పోలీసుల ఫ్లాగ్ మార్చ్

రిపోర్టర్: Durgam Syam స్థలం: సీతారామపురం

సీతారామపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు సోమవారం ప్రత్యేకంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఉదయగిరి సీఐ అంకమ్మరావు ఆధ్వర్యంలో బసినేనిపల్లి సింగారెడ్డిపల్లి గ్రామాలతో పాటు పట్టణంలో కవాతు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల్లో భైను తొలగించి భరోసా కల్పించేందుకు ఈ ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.