చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పక్షవాత బాధితుడు అదృశ్యం: ఆచూకీ కోసం గాలింపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: సికింద్రాబాద్

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద నంద్యాలకు చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి అదృశ్యమైనట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 7వ తేదీ రాత్రి రైలు దిగలేక స్టేషన్లోనే ఉండిపోయి కనిపించకుండా పోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.