ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ: నిరుపేదల సొంతింటి కల సాకారం
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట మండలంలోని శంకరం తండా, గొల్లభామ తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్, సొసైటీ చైర్మన్లు భూక్య గోపాల్ నాయక్, మొగిలి వెంకట్ రెడ్డి హాజరై లబ్ధిదారులు కొర్ర వసంత, అమ్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నామని నేతలు పేర్కొన్నారు.