పెంటగాన్ కు చైనా దైవనాగ గుబులు: షెన్లాంగ్ స్పేస్ ప్లేన్ ఫొటో విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: వాషింగ్టన్
అమెరికా రక్షణ రంగానికి చైనాకు చెందిన రహస్య పునర్వినియోగ స్పేస్ ప్లేన్ షెన్లాంగ్ భారీ గుబులు పుట్టిస్తోందని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదికలో వెల్లడించింది. అంతరిక్ష రంగంలో ఆధిపత్యం సాధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు వేగవంతం చేసిన వేళ, చైనా ప్రయోగించిన దైవనాగ నౌకకు సంబంధించిన హై-రైజ్ చిత్రాన్ని డీఐఏ తొలిసారిగా విడుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నౌక కక్ష్యలో తిరుగుతూ అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతోందని రక్షణ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.