యాదాద్రి పవర్ ప్లాంట్ ముట్టడిలో కాంగ్రెస్ సర్కార్ను నిలదీసిన జగదీష్ రెడ్డి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: దామరచర్ల

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నేతృత్వంలో వర్షాన్ని లెక్కచేయకుండా పవర్ ప్లాంట్ను ముట్టడించారు. విద్యుత్ సరఫరాలో వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.