'పాలస్తీనాకు సంఘీభావం': ఇజ్రాయెల్‌తో చెస్ మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్థాన్
రిపోర్టర్: రాజేష్
స్థలం: సమర్‌కండ్
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరుగుతున్న 46వ ఫిడే వరల్డ్ చెస్ ఒలింపియాడ్‌లో ఇజ్రాయెల్‌తో జరగాల్సిన ఓపెనింగ్ రౌండ్ మ్యాచ్ నుంచి పాకిస్థాన్ తప్పుకుంది. ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించని ప్రభుత్వ విధానానికి కట్టుబడి, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు చెస్ ఫెడరేషన్ ఆఫ్ పాకిస్థాన్ (సీఎఫ్‌పీ) అధ్యక్షుడు సయ్యద్ జీషన్ నక్వీ స్పష్టం చేశారు. దీంతో ఇజ్రాయెల్‌కు 4-0తో డిఫాల్ట్ విజయం లభించగా, పాకిస్థాన్ తదుపరి రౌండ్లలో పాల్గొనేందుకు అర్హత కలిగి ఉంది.