రేపల్లెలో ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన కొలుసు పార్థసారథి
రిపోర్టర్: సురేష్
స్థలం: ఏలూరు
రేపల్లె పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పేదల సేవలో కార్యక్రమం ఏర్పాట్లను గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, ప్రజావేదిక అలాగే కార్యకర్తల సమావేశం నిర్వహించే ప్రాంతాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు మరియు కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను అత్యంత పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రతిష్టాత్మక పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.