జమ్మూకశ్మీర్‌లో పాక్ ఐఎస్ఐ హైటెక్ కుట్ర భగ్నం

రిపోర్టర్: శివ స్థలం: జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్‌లోని కఠువా సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ సాగిస్తున్న హైటెక్ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్‌లో చిక్కుకుని, పాక్ హ్యాండ్లర్ల కోసం సరిహద్దులో నిఘా పెట్టిన 24 ఏళ్ల ట్రక్ డ్రైవర్ అమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తన ఇంటి వద్ద సిమ్ ఎనేబుల్డ్ సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసి, భద్రతా బలగాల రాకపోకల లైవ్ ఫుటేజ్‌ను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది.