టెక్ మార్కెట్లోకి ఒప్పో ఎన్కో ఎక్స్ ఫోర్ ఇయర్‌బడ్స్: ధర రూ. 19,999
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
భారతీయ మార్కెట్లోకి కొత్త ప్రీమియం ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసినట్లు ప్రముఖ టెక్ సంస్థ ఒప్పో వెల్లడించింది. ఒప్పో ఎన్కో ఎక్స్ ఫోర్ పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ డివైస్ ధరను రూ. 19,999 గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో డ్యూయల్-డ్రైవర్ సెటప్, అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, లాస్‌లెస్ ఆడియో సపోర్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ ఇయర్‌బడ్స్ కేస్ తో కలిపి మొత్తం 53 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయని వివరించింది.