ఓటు హక్కుపై క్విజ్ పోటీలతో అదరగొట్టిన జన్నారం విద్యార్థులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎన్నికల ప్రక్రియ ఓటు హక్ కు ప్రజాస్వామ్య విలువలపై మంగళవారం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ పోటీలు ఏర్పాటు చేశామని మండల తహసిల్దార్ బక్కయ్య తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు.