అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

కుషాయిగూడ మరియు జూబ్లీహిల్స్ పరిధిలో బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అంబర్‌పేట శంకర్‌పై పోలీసులు మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేశారు. 2019లో ఆయనపై ఉన్న రౌడీషీట్‌ను పోలీసులు మూసివేశారు. తాజాగా పలు పోలీస్‌స్టేషన్లలో వరుస కేసులు నమోదవడంతో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. వివాదాలు, సెటిల్‌మెంట్లు మరియు బెదిరింపుల ఆరోపణలతో శంకర్ మరోసారి పోలీసుల నిఘాలోకి వచ్చారు.