గెలాక్సీ వినియోగదారులకు యూపీఐ చెల్లింపుల్లో బయోమెట్రిక్ భద్రత తెచ్చిన శామ్సంగ్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
భారతదేశంలో శామ్సంగ్ వాలెట్ యూపీఐ చెల్లింపుల కోసం సరికొత్త బయోమెట్రిక్ ప్రామాణీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా గెలాక్సీ స్మార్ట్ఫోన్ వినియోగదారులు రూ. 10,000 వరకు యూపీఐ లావాదేవీలను వేలిముద్ర సెన్సార్ ద్వారా సులభంగా నిర్ధారించుకోవచ్చు. పిన్ నంబర్ నమోదు చేసే అవసరం లేకుండా నేరుగా చెల్లింపులు చేయవచ్చని శామ్సంగ్ ఇండియా గురువారం స్పష్టం చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా డిజిటల్ లావాదేవీలలో గోప్యత మరింత మెరుగుపడుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.