తిరుమల శ్రీవారి ఆలయంలో వెలుగులోకి అచ్యుతదేవరాయల పురాతన శాసనం

రిపోర్టర్: హరి స్థలం: తిరుమల

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు చేపట్టిన శాసనాల అచ్చుతీసే ప్రక్రియలో అచ్యుతదేవరాయల నాటి అరుదైన శాసనం వెలుగుచూసిందని అధికారులు తెలిపారు. ఆలయ మూడో ప్రాకారం దక్షిణగోడపై తమిళ భాషలో ఉన్న ఈ శాసనాన్ని 1540 డిసెంబర్ 31న ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీవారికి ప్రత్యేక సేవలు, నైవేద్యాల నిర్వహణ కోసం చంద్రగిరికోట మిలిటరీ కమాండర్ దళవాయి తిమ్మర సయ్యర్ బంగారు నాణేలు, పణాలను దేవాలయ నిధికి జమచేసినట్లు శాసనం ద్వారా స్పష్టమైందని వెల్లడించారు.