మాధవనగర్ అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలి

రిపోర్టర్: శివ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ ప్రాంతంలో జరిగిన దిశా సమావేశంలో మాధవనగర్ మరియు అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించినట్లు Arvind Dharmapuri వెల్లడించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం లోపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి జాప్యం జరగకుండా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన అడ్డంకులను వెంటనే తొలగించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు తేల్చిచెప్పారు.