అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి హీరో రామ్ పోతినేని ఆర్థిక సాయం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తూర్పు గోదావరి

అరుదైన జన్యు వ్యాధితో మంచానికే పరిమితమైన వీరాభిమాని శశి భవ్యత పరిస్థితి తెలుసుకుని హీరో రామ్ పోతినేని చలించిపోయారు. వీడియో కాల్‌లో మాట్లాడి భరోసా కల్పించిన ఆయన, వైద్య ఖర్చులతో పాటు మందులు, పౌష్టికాహారాన్ని పంపించారు. తన వ్యక్తిగత కళ్లద్దాలను కూడా బహుమతిగా పంపి మానవత్వం చాటుకున్నారు.