ప్రజలకు గుడ్ న్యూస్: నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రగతి నివేదిక విడుదల

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో నియోజకవర్గాల వారీగా జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ ఫలాల సమగ్ర వివరాలను ప్రణాళిక శాఖ తాజాగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో జరిగిన ప్రగతి నివేదికను సులభంగా పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధి, ఆర్థిక సహాయం వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించామని అధికారులు స్పష్టం చేశారు.