సమాచార హక్కు చట్టంపై అవగాహన: శ్రీరంగరాజపురంలో ఆర్టీఐ వారోత్సవ ర్యాలీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీరంగరాజపురం

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో ఆర్టీఐ అవేర్నస్ సంస్థ ఆధ్వర్యంలో 21వ వారోత్సవ యాత్ర ఘనంగా నిర్వహించారు. పుల్లూరు క్రాస్ నుంచి వివిధ ప్రభుత్వ కార్యాలయాల మీదుగా సాగిన ఈ శాంతియుత ర్యాలీలో పలువురు నాయకులు, సభ్యులు పాల్గొని చట్టం ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.