ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు కస్టడీకి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కాకినాడ
కాకినాడలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ను మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. సర్పవరం పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుని తీవ్ర భద్రత నడుమ విచారిస్తున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు, ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.