రాజకీయాల్లో జగన్‌లాంటి క్రిమినల్స్ ఉంటే ప్రమాదకరం: సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
లిటిగెంట్లతో అభివృద్ధిని, ఎన్నికలను అడ్డుకోవడమే గొడ్డలిపార్టీ ప్రధాన పని అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, కోర్టు తీర్పులను వక్రీకరిస్తూ ఆ పార్టీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. బెంగళూరులో కూర్చొని విధ్వంస రచనలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో జగన్‌లాంటి క్రిమినల్స్ ఉంటే ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు.