యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
రిపోర్టర్: అశోక్
స్థలం: గ్రేటర్ నోయిడా
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. బస్సు డ్రైవర్, కండక్టర్ సిగరెట్లు తాగుతూ ప్రయాణికుల హెచ్చరికలను పెడచెవిన పెట్టడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో వెల్లడైంది. ఏసీ సిస్టమ్‌లో పేలుడు సంభవించి ఇంజిన్‌లోని ఆయిల్ మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుని ప్రాణనష్టం సంభవించింది.