పెద్దపల్లి జిల్లాలో లెక్చరర్ ఘాతుకం విద్యార్థిని బలవంతంగా హత్య
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రేమ పేరుతో మోసం చేసి విద్యార్థిని తాండ్ర అక్షితరాణిని కాంట్రాక్ట్ లెక్చరర్ జెట్టి నవీన్ హత్య చేసిన దారుణ ఘటన వెలుగు చూసింది. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందన్న కక్షతో నవీన్ ఆమె ఫోన్‌లో స్పై యాప్ ఇన్‌స్టాల్ చేసి కదలికలు గమనించాడు. ఈ నెల 12న కారులో తిప్పుతూ బలవంతంగా గడ్డి మందు తాగించి, లేఖ రాయించి ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ అక్షిత 13న ప్రాణాలు కోల్పోయింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నవీన్‌తో పాటు రవికుమార్‌ను అరెస్ట్ చేశారు.