'బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించండి': అనంతపురం ఎస్పీ జగదీష్ ఆదేశాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Ananthapur

అనంతపురం జిల్లాలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఎస్పీ పి.జగదీష్ స్వయంగా బాధితుల నుంచి 71 వినతులు స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించి, పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.