సాంకేతిక సమస్యతో ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

ఢిల్లీ నుంచి కాట్మాండు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 విమానం సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. ప్రమాదకర పరిస్థితి తలెత్తకుండా సిబ్బంది ప్రామాణిక నిబంధనలను పాటిస్తూ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానంలో కాట్మాండుకు ఏర్పాట్లు చేశామని, ఈ అనూహ్య పరిణామం వల్ల కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది.