రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి: భారతీయుడు మృతి, పది మందికి గాయాలు

రిపోర్టర్: శివ స్థలం: రియాద్

సౌదీ అరేబియాలోని రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన భీకర క్షిపణి దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్లు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ దుర్ఘటనలో మరో పది మంది భారతీయులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుని కుటుంబానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.