హైకీ ఇండియా సెక్రటరీపై లైంగిక వేధింపుల ఆరోపణల విచారణకు కమిటీ

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

హాకీ ఇండియా కార్యదర్శి భోలా నాథ్ సింగ్‌పై మాజీ కెప్టెన్ అసుంటా లాక్రా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు నలుగురు సభ్యులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి దీపా శర్మ నేతృత్వంలో ఈ కమిటీ దర్యాప్తు చేపట్టనుంది.