స్పెషల్ టెట్ మాక్ టెస్టుల వివాదం: ఉపాధ్యాయులకు ఓడీ సౌకర్యంపై నిరుద్యోగుల మండిపాటు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్పెషల్ టెట్-2 ఆన్లైన్ మాక్ టెస్టులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని నిరుద్యోగులు తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షపై అవగాహన కోసం ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఓడీ సౌకర్యం కల్పించి జిల్లా కేంద్రాల్ లో ఏర్పాట్లు చేయడంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తమవుతోంది. నిరుద్యోగులకు మాత్రం సుదూర ప్రాంతాల్ లో పరీక్షా కేంద్రాలు కేటాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యాశాఖ తీరును వారు తప్పుపట్టారు.