ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు: వడోదరలో మరో కీలక మైలురాయి
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో మరో కీలక మైలురాయిని విజయవంతంగా సాధించినట్లు భారతీయ రైల్వే శాఖ వెల్లడించింది. వడోదరలోని ఢిల్లీ-ముంబై రాజధాని మెయిన్ లైన్ పై మొత్తం పద్నాలుగు పోర్టల్ బీమ్ ల నిర్మాణాన్ని ఎలాంటి అంతరాయాలు లేకుండా పూర్తి చేశామని అధికారులు స్పష్టం చేశారు. దేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.