అంతర్జాతీయ మార్కెట్ లో మళ్లీ భగ్గుమన్న ముడి చమురు ధరలు

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు మళ్లీ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇరాన్ కు చెందిన ఖేష్మ్ ద్వీపంపై అమెరికా మిలిటరీ దాడి జరిగిందన్న వార్తలతో ఆసియాన్ ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 105 డాలర్లకు చేరుకుంది. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.