ఖానాపూర్లో రెండు కోట్లతో నూతన ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖానాపూర్
మంచిర్యాల జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రం భవన నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.