చిన్న వ్యాపారులకు తీపి కబురు: నెలకు రూ.3వేల పెన్షన్ అందించే కేంద్ర పథకం

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

చిన్న దుకాణదారులు మరియు రిటైల్ వ్యాపారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధన్ పథకాన్ని అందిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన అర్హులైన స్వయం ఉపాధిదారులకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుందని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలని, వార్షిక టర్నోవర్ కోటిన్నర రూపాయలకు మించకూడదని అధికారులు స్పష్టం చేశారు.