ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులు బెల్లంపల్లి కొత్త బస్టాండ్ పై నిర్లక్ష్యం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కొత్త బస్టాండ్లోకి బస్సులు వెళ్లకపోవడంతో ప్రయాణికులు, పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసలేటి వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సులను రోడ్డుపైనే నిలపడంతో నిత్యం ప్రమాదాల ముప్పు పొంచి ఉందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బస్సులను లోపలికి నడిపించాలని వారు డిమాండ్ చేశారు.