ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపు

రిపోర్టర్: Radha. A స్థలం: కడెం

కడెం మండల రైతు వేదికలో తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగేల భూషన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించి నేల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. అనంతరం అధికారులు ప్రకృతి వ్యవసాయ విధానాలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించి రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.