పెళ్లి పేరుతో మోసం కేసులో మహాభారత్ నటుడు సౌరవ్ గుర్జార్ అరెస్ట్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

మహాభారత్ సీరియల్ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుర్జార్‌ను హైదరాబాద్ గచ్చిౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై విమానాశ్రయంలో సౌరవ్ గుర్జార్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అమెరికా, హైదరాబాద్‌లో తనతో సహజీవనం చేసి ఆ తర్వాత ముఖం చాటేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.