తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: వీఐపీ దర్శనాలు పూర్తిగా రద్దు

రిపోర్టర్: గోపి స్థలం: తిరుమల

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాల నేపథ్యంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రొటోకాల్ ప్రముఖులు మినహా ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.