విజయ సాయిరాజ్కు ఘనంగా ఆత్మీయ సత్కారం చేసిన కూన రవికుమార్

రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసిన పిరియా విజయ సాయిరాజ్ను కళింగ కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ అభినందన సభకు ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ఆమెను దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ప్రజా సమస్యల పరిష్కారానికి, జిల్లా సమగ్రాభివృద్ధికి విజయ సాయిరాజ్ అందించిన సేవలు ఎంతో ప్రశంసనీయమని ఈ సందర్భంగా కూన రవికుమార్ కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.