ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు తన ప్రాధాన్యం కాదంటూ మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కొచ్చి

ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే లక్ష్యంతోనే తాను పని చేస్తున్నానని, విద్యా వ్యవస్థను వీలైనంత త్వరగా మార్చడమే ఇప్పుడు తన ప్రాధాన్యత అని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు తన ప్రాధాన్యం కాదని, విద్యా శాఖతో పాటు ఐటీ రంగంలో ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించడమే తన ధ్యేయమని వెల్లడించారు. ఎన్నికల వ్యవస్థపై వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.