దేశాభివృద్ధికి యువత నిరంతరం కృషి చేయాలి: ఎల్వీ సుబ్రహ్మణ్యం
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ రామకృష్ణ మఠం పరిధిలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 'యువ సమ్మేళనం' ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పౌరులు బాధ్యతలను నిర్వర్తిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద బోధనలతో యువత ఆత్మన్యూనత వీడి దేశాన్ని అగ్రగామిగా నిలపాలని వక్తలు ఆకాంక్షించారు.